news

Welcome : to HRF 7th Bi-Telugu States Conference by State Committee Venue : "Pdmanayaka Function Hall;MANCHIRYAL;MANCHIRYAL DIST;T.S." on 14 & 15th October,2017 ; Time : 10 AM to 5 PM ; TOPIC : '1.Hindutva Kaalam Lo Kotta Dalita Udyamalu ; 2.Encounterlu - Chattam - Supreme Court Teerpu ; 3.Aatma Gourava Poratalu ; 4.Nirasana Hakku Pi Ankshalu .......... Next ..... Please attend to HRF classes on 15th at Building ;.

Thursday, January 4, 2018

తరాలు మారినా, కాలం మారినా వేలివాడల బ్రతుకులు వెట్టికోసమేనా ? .
కర్నూలు జిల్లా,రుద్రవరం మండలం, నక్కలదిన్నే గ్రామంలో జరిగిన దళితుల సామాజిక భాహిష్కరణ ఈ ప్రశ్ననే సమాజం ముందు ఉంచింది. రాజ్యం మారినా, రాజ్య స్వరూపం మారినా, రాజ్యాంగం ఉన్నా, రాజ్యంగ విలువలు హక్కులు ఉన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తూ ఉన్నా మల్లా అదే మౌళిక ప్రశ్ననే లేవనేతింది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య స్థానం ఎక్కడ ? దాని గమనం ఎటు ?
నక్కలదిన్నే గ్రామంలో 14 మాల, 4 మాదిగ కుటుంబాల దళిత వాడ వుంది. ఎలీష, పుల్లన్న, జయాన్న, ఓబులేషు అనే 4 కుటుంబాలు ఎట్టి పని చేయాలి అంటే, శవాలు పూడ్చడం ,కాల్చడం .
ఇందుకుగాను 12 ఎకరాలు ఎట్టి మాన్యం పూర్వం ఏర్పాటు చేశారు.
తరాలుగా వస్తున్నా ఈ పని మేము చేయమని తేల్చి చెప్పి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇదే నేరంగా తలచిన అగ్రకుల పెతందార్లు దళితుల సామాజిక భాహిష్కరణకు పూనుకున్నారు. మేం చెప్పిన పని చేయని మీకు నీళ్ళు ఉండవు, కరెంటు ఉండవు అని దుషిస్తూనే దళితవాడ కు
నీళ్ళు వచ్చే పైపులు ద్వంసమ్ చేసి,, దళితవాడ నుంచి రాకపోకలు కొనసాగడానికి వీలులేదు, అంగడి సరుకులు అమ్మడానికి వీలులేదు అని, కూలీ పిలవరాదని, వారితో మాట్లాడరాదని, వీటిని మిరితే ఐదు వేలు జరిమానా అని డప్పుతో చాటింపు వేయించారు.
మాన్యాలు ఎప్పుడో రద్దయ్యాయని ,ఎవరి చేత బలవంతం గా పనులు చేయించకూడదనే,కనీస ప్రజాస్వామ్య సూత్రాలు కూడా ప్రజా చైతన్యంలో లేకపోవడానికి ప్రభుత్వ, అధికార యంత్రాంగ వైఫల్యమే.ఇప్పటికి కూడ యసి,యస్టి, అత్యాచారాల నిరోధక చట్టం క్రింద పునరావాసం, సహాయం అందకపోవడం దారుణం.

దేవేంద్ర బాబు ముందరింటి , మానవ హక్కుల వేదిక.